అభివృద్ధి, సంక్షేమ పనులు సకాలంలో పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-04-18T05:22:06+05:30 IST

అభివృద్ధి, సంక్షేమ పనులు సకాలంలో పూర్తయ్యేలా అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్‌ రవి అన్నారు.

అభివృద్ధి, సంక్షేమ పనులు సకాలంలో పూర్తి చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి

జగిత్యాల కలెక్టర్‌ రవి

జగిత్యాల, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమ పనులు సకాలంలో పూర్తయ్యేలా అధికారులు ప్రణాళిక  రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్‌ రవి అన్నారు. శనివారం పట్టణంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి మండల, ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సదర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ త్వరలో జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికల కొరకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయా లన్నారు. పోలింగ్‌ కేంద్రాలను గుర్తించడం, సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు జరపాలన్నారు. గతంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన విధంగా జాగ్రత్తగా వ్యవహరించాల న్నారు. గ్రామాలలో లేబర్‌ టర్నవుట్‌ సక్రమంగా జరిగే లా చూడాలన్నారు. పనులు జరిగే చోట కోవిడ్‌ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు. చేతులను శుభ్రం చేసుకోవడానికి నీటి ని, సబ్బును ఏర్పాటు చేయాలన్నారు. చివరి దశలో ఉన్న 22 వైకుంఠధామాల నిర్మాణ పనులను మరింత వేగవం తం చేయాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు అమలులో జిల్లాలో అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. పాజిటివ్‌ వ్యక్తులను బయటకు వెళ్లకుండా హోం ఐసో లేషన్‌లో ఉంచాలన్నారు. పాజిటివ్‌ నిర్ధారణ అయి బయ ట తిరుగుతున్న వ్యక్తుల వివరాలను అధికారులకు తెలియజేయాలన్నారు. సకాలంలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోవాల న్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, డీఆర్‌డీఓ పీడీ వినోద్‌, పలువురు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-18T05:22:06+05:30 IST