సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి

ABN , First Publish Date - 2021-03-02T05:59:13+05:30 IST

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ ముందుకు సాగాలని జడ్పీచైర్‌పర్సన్‌ రోజాశర్మ సూచించారు.

సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి

జడ్పీచైర్‌పర్సన్‌ రోజాశర్మ


చిన్నకోడూరు, మార్చి 1 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ ముందుకు సాగాలని జడ్పీచైర్‌పర్సన్‌ రోజాశర్మ సూచించారు. సోమవారం చిన్నకోడూరు మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వేసవి దృష్ట్యా గ్రామాల నర్సరీల్లో, హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందన్నారు. పలువురు సర్పంచ్‌లు విద్యుత్‌ సంబంధిత సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. పలుగ్రామాల్లో నెలకొన్న విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలని జడ్పీచైర్‌పర్సన్‌ రోజాశర్మ విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ శాఖ ఏడీఈ మహే్‌షకుమార్‌ మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయితీ విద్యుత్‌ కనెక్షన్‌ (విద్యుత్‌ మీటరు) తీసుకోవాలన్నారు. జడ్పీసీఈవో సుమతి మాట్లాడుతూ చౌడారం, సికింద్లాపూర్‌ గ్రామాల నర్సరీల్లో మొక్కలు ఎండిపోతున్నాయని, అదేవిధంగా చౌడారం గ్రామంలో చెత్తను డంప్‌ షెడ్‌లో వేయడంలేదని, గ్రామాలలో చెత్తను డంప్‌ షెడ్లలో వేయాలన్నారు. ఎంపీపీ మాణిక్యరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాలలో ఉన్న పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం ఎంపీడీవో శ్రీనివాస్‌, సర్పంచులు మాట్లాడారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌  శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు సదానందం, కనకరాజు, డీసీసీబీ జిల్లా డైరెక్టర్‌ రాంచంద్రం, సర్పంచులు, ఎంపీటీసీలు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T05:59:13+05:30 IST