టీడీపీ పాలనలో సమగ్రాభివృద్ధి

ABN , First Publish Date - 2022-05-20T05:14:55+05:30 IST

టీడీపీ పాలనలో రేబాల గ్రామం సమగ్రాభివృద్ధి చెందిందని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు.

టీడీపీ పాలనలో సమగ్రాభివృద్ధి
రేబాల గాందీనగర్‌లో పర్యటిస్తున్న పోలంరెడ్డి, టీడీపీ నాయకులు

మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి 

బుచ్చిరెడ్డిపాళెం, మే19 : టీడీపీ పాలనలో రేబాల గ్రామం సమగ్రాభివృద్ధి  చెందిందని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. గురువారం ఆయన రేబాలలోని గాంధీనగర్‌లో నిర్వహించిన  ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రేబాలలో టీడీపీ   హయంలో 108 కుటుంబాలకు రూ.కోటీ 62లక్షలతో గృహనిర్మాణాలకు శ్రీకారం చుడితే మూడేళ్లలో మీ ప్రభుత్వం ఎన్ని ఇళ్లు నిర్మించిందని ఎమ్మెల్యే ప్రసన్నను ప్రశ్నించారు.  సీఎంఆర్‌కు ధాన్యం తోలిన రైతులకు నేటికీ డబ్బులు పడక అల్లాడుతున్నారన్నారు. మండలంలోని మినగల్లు ఇసుక రీచ్‌కు అనుమతులు లేకుండానే నిత్యం కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ర్టాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో  టీడీపీ మండల అధ్యక్షుడు ఎంవీ. శేషయ్య, బత్తల హరికృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, కృష్ణచైతన్య, హరనాద్‌, మహేష్‌నాయుడు, శివ, కోటి, శివ, శ్రీనివాసులురెడ్డి, అన్వర్‌బాషా, చిన్నయ్య, నజీర్‌, వెంకటరమణయ్య, పెంచలయ్య, ఉమ్మయ్యస్వామి, నాగరాజు, పెంచలయ్య, నరసింహులు, కొండయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వెంకన్నపాళెంలో బాదుడే బాదుడు..

తోటపల్లిగూడూరు :  మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో గురువారం బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర  మాట్లాడుతూ ఈ ప్రభుత్వం హయాంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, నిత్యావసరాలు, పెట్రోలు, గ్యాస్‌ ధరలు పెరిగిపోయాయని తెఇపారు. చౌకగా దొరికేది రైతు పండించిన ధాన్యమేనన్నారు. కార్యక్రమంలో నాయకులు మద్దిన గోపాల్‌నాయుడు, రామ్మోహన్‌, పామంజి రామకృష్ణ, చింతా సీతారామయ్య, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, స్థానికులు,  పాల్గొన్నారు. 

వెంకటాచలం: వైసీపీ నాయకుల అండదండలతోనే నెల రోజుల నుంచి మండలంలో విచ్చలవిడిగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని టీడీపీ మండలాధ్యక్షుడు గుమ్మడి రాజాయాదవ్‌ ఆరోపించారు. మండలంలోని తిక్కవరప్పాడు గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన బాదుడేబాదుడు కార్యక్రమంలో ఆయన ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కాకుటూరు పరిధిలోని పరిశ్రమల కేంద్రం వెనుక, సమీప అటడీ ప్రాంతంలో జరుగుతున్న పేకాట, కోడి పందెం, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాల పై ఉన్నతాధికారులు దృష్టి సారించి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన  చేస్తామని హెచ్చరించారు. మండలంలోని ఇస్లాంపేట, కురిచెర్లపాడు గ్రామాల్లో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మావిళ్లపల్లి శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో బాదుడే బాదుడు జరిగింది. కార్యక్రమంలో పాకం శ్రీకాంత్‌రెడ్డి, వలిపి మునుస్వామి, పఠాన్‌ ఖాయ్యుమ్‌ ఖాన్‌, జోషి, శ్రీకాంత్‌నాయుడు, షేక్‌ సత్తార్‌ సాహెబ్‌, గుమ్మా దిలీప్‌, గుండెమడుగుల రమేష్‌ బాబు, శ్రీహరి, యాకల రవి, సండి రమేష్‌, వలిపి వెంకటేష్‌ తదితరులున్నారు. 

మనుబోలు : మండలంలోని వెంకన్నపాళెం పంచాయతీలో టీడీపీ నాయకులు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. పెంచిన ధరలపై కరపత్రాలతో పాటు కొవ్వొత్తులను ఇంటింటికి  పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి పొన్నూరు రామకృష్ణయ్య, టీడీపీ మండలాధ్యక్షుడు గాలి రామకృష్ణా రెడ్డి, హనుమం తనాయుడు, శేఖర్‌నాయుడు  పాల్గొన్నారు. 

కొడవలూరు :  వైసీపీ పాలనలో రాష్ట్రంలో పెరిగిన విద్యుత్‌ చార్జీలు , నిత్యావసర ధరలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి అన్నారు. మండలంలోని వెంకన్నపురం, బసవాయపాలెం గ్రామంలో గురువారం జరిగిన ఇంటీంటికి టీడీపీ కార్యక్రమంలో ఆయన బాదుడే బాదుడు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. పరిశ్రమలు రాక నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు.   వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పట్టం గట్టాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T05:14:55+05:30 IST