వేపూర్‌లో అభివృద్ధి వెలుగులు

ABN , First Publish Date - 2021-05-11T04:13:44+05:30 IST

దేశానికి గ్రామాలు పట్టుగొమ్మలు. గ్రామాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది.

వేపూర్‌లో అభివృద్ధి వెలుగులు
వేపూర్‌లో ప్రకృతి వనం

- ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్న వైనం


కల్వకుర్తి అర్బన్‌, మే 10: దేశానికి గ్రామాలు పట్టుగొమ్మలు. గ్రామాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. మహ్మాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంకు కల్వకుర్తి మండల పరిధిలోని వేపూర్‌ అద్దం పడు తోంది. పచ్చని ప్రకృతి అందాలతో సమాగ్రభివృద్ధి బాటలో వేగంగా దూ సుకెళుతున్న వేపూర్‌ గురించి ప్రత్యేక కథనం. వేపూర్‌ గ్రామ పంచాయ తీలో జనాభా రెండు వేల ఐదు వందలు ఉంటుంది. కానీ గ్రామ పంచా యతీకి వచ్చే నిధులు తక్కువగా ఉన్నా గ్రామంలో నూతన వనరులను సృష్టించుకొని గ్రామాభివృద్ధికి బాటలు వేశారు. గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ నీళ్లను అందిస్తున్నారు. గ్రామంలో పారిశుధ్యానికి ప్రాధ్యానం ఇవ్వడంతో గ్రామంలో అపరిశుభ్రతకు తావు లేదు. గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను వంద శాతం పూర్తి చేసి జిల్లా పరిధిలోనే ఇతర గ్రామ పంచాయతీలకు ఆదర ్శంగా నిలిచింది. అం తే కాదు గ్రామ పంచాయతీలకు వచ్చే ఏ అభివృద్ధి పథకం అయినా నా ణ్యతగా అత్యంత వేగంగా పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం వేపూర్‌ గ్రామ పంచాయతీ ప్రత్యేకత. గ్రామంలోకి ప్రవేశించగానే పల్లె ప్రకృతి సాదర స్వాగతం పలుకుతోంది. రోడ్డుకిరువైపులా పచ్చని మొక్కలు, చెట్లు తోరణం వలె ఉంటాయి. గ్రామంలోని నర్సరీలు కూడా గ్రామ ప్రజ లకే కాక ఇతరులకు కూడా అరుదైన మొ క్కలను అందించి ప్రకృతికి పెద్దపీట వేస్తోం ది. ఉపాధి హామీ పనులు గ్రామంలోని ప్రతీ కూలీకి ఆసరాగా నిలుస్తున్నాయి. ఉపాధి హా మీ పథకం ద్వారా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. వేపూర్‌ నుంచి ఆకునెల్లికుదురు గ్రామానికి రోడ్డు వేశారు. 


అభివృద్ధి పనులు 

గ్రామంలో రూ.12లక్షల 60వేలతో క్రిమిటోరి యం, రూ.2లక్షలతో డంపింగ్‌ యార్డు, నూతన గ్రామపంచాయతీ భవనా న్ని రూ. 18 లక్షలతో నిర్మించుకున్నారు. రూ. 11 లక్షలతో యాదవ సం ఘం భవనం నిర్మాణం చేసుకున్నారు. ప్రకృతి వనాన్ని రూ. 3 లక్షలతో ఏర్పాటు చేసుకున్నారు. 


గ్రామంలో మూడో కన్ను 

 సిటీ ప్రదేశాల్లో ఉన్నట్లు సీసీ కెమెరాలు వేపూర్‌లో దర్శనం ఇస్తాయి. గ్రామంలో ఏ దొంగతనం జరిగినా క్షణాల్లో పట్టుకునేందుకు సీసీ కెమెరా లు ఉపయోగపడుతున్నాయి. అందుకే చుట్టుపక్కల గ్రామాల్లో చిన్న చి న్న దొంగతాలు జరిగినా.. వేపూర్‌లో మాత్రం అసాంఘిక కార్యక్రమాలకు సీసీ కెమెరాల నిఘా చెక్‌  పడుతోంది. దాదాపు రూ.లక్షా 20వేలతో అత్యధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అందుకే వేపూర్‌ అంటే పోలీసులకు కూడా టెన్షన్‌ ఉండదు. 


ఎల్‌ఈడీ వెలుగుల్లో..

ఎల్‌ఈడీ కాంతుల మధ్య వేపూర్‌ నిత్య వెలుగులతో కళకళలాడుతోం ది. గ్రామంలోని ప్రతి గల్లీకి ఎల్‌ ఈడీ కాంతుల వెలుగుల్లో కాలనీలు రాత్రి సైతం పట్టపగలు తలపిస్తోం ది. విద్యుత్‌ సమస్య పరిష్కారం కోసం గ్రామ పంచాయతీ పాలక వర్గం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది.


గ్రామాన్ని ఉన్నత స్థానంలో నిలపడమే లక్ష్యం 

వేపూర్‌ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొని రావడమే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నాం. ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌, ఎంపీ రాములు తో పాటు గ్రామ ప్రజల తోడ్పాటుతో అధికారుల సహకారంతో నిధులు తక్కువగా ఉన్నా అభివృద్ధి లో మాత్రం ముందు ఉంటున్నాం. 

- మాధవి, గ్రామ సర్పంచ్‌ వేపూర్‌ 



Updated Date - 2021-05-11T04:13:44+05:30 IST