రూ.3.55 కోట్లతో ఐదు జూనియర్‌ కళాశాలల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-10-01T07:03:12+05:30 IST

నియోజకవర్గంలో ఐదు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నాడు-నేడు పథకంలో రెండవ విడతలో రూ.3.55 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నట్టు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ తెలిపారు.

రూ.3.55 కోట్లతో ఐదు జూనియర్‌ కళాశాలల అభివృద్ధి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గణేష్‌


నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ 

  నర్సీపట్నం అర్బన్‌, సెప్టెంబరు 30: నియోజకవర్గంలో ఐదు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నాడు-నేడు పథకంలో రెండవ విడతలో రూ.3.55 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నట్టు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక   ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నాడు-నేడు నిధులతో చేపట్టే పనులకు ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాకవరపాలెం జూనియర్‌ కళాశాలకు రూ. 62.921 లక్షలు, వేములపూడి జూనియర్‌ కళాశాలకు రూ.31.121 లక్షలు, నర్సీపట్నం మహిళా జూనియర్‌ కళాశాలకు రూ. 69.92 లక్షలు, నర్సీపట్నం జూనియర్‌ కళాశాలకు రూ. 121.83 లక్షలు, కృష్ణాదేవిపేట జూనియర్‌ కళాశాలకు రూ.65.31 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో ఆయా జూనియర్‌ కళాశాలల్లో అభివృద్ధి పనులు చేపడతారన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఆదిలక్ష్మి, వైస్‌చైర్మన్లు నరసింహమూర్తి, తమరాన అప్పలనాయుడు, వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివ, ప్రిన్సిపాల్‌ చిన్నారావు, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-10-01T07:03:12+05:30 IST