‘మన ఊరు-మన బడి’తో పాఠశాలల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-05-14T06:26:36+05:30 IST

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మన ఊరు-మనబడి పథకం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన జైనథ్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.8.5లక్షల వ్యయంతో నిర్మించే అదనపు

‘మన ఊరు-మన బడి’తో పాఠశాలల అభివృద్ధి
ప్రాథమిక పాఠశాలలో భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే రామన్న

ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న

జైనథ్‌, మే 13: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మన ఊరు-మనబడి పథకం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన జైనథ్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.8.5లక్షల వ్యయంతో నిర్మించే అదనపు తరగతుల నిర్మాణానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేజీ టూ పీజీ వరకు ఇంగ్లీష్‌ విద్యను అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా అదన పు కలెక్టర్‌ నటరాజన్‌ మాట్లాడుతూ మండలంలో మొదటి విడతగా ఈ పథకం ద్వారా 22 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ బ్యాంక్‌ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణిత,  ఎంపీపీ ఎం.గోవర్ధన్‌, వైస్‌ ఎంపీపీ విజయ్‌కుమార్‌, జడ్పీటీసీ తుమ్మల అరుంధతివెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ రాఘవేందర్‌రావ్‌, ఎంపీడీవో కె.గజనాన్‌రావ్‌, డిపార్ట్‌మెంట్‌ ఈఈ అశోక్‌, సర్పంచ్‌ డి.దేవన్న, తదితరులు పాల్గొన్నారు. 

నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు

ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. శుక్రవారం  మండలంలోని తరోడ గ్రామంలో ఇతర పార్టీలకు చెందిన 200 మంది ఎమ్మెల్యే   సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌ హాయాంలో పల్లె ప్రగతి పూర్తిగా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ ఎం.గోవర్ధన్‌, వైస్‌ ఎంపీపీ విజయ్‌కుమార్‌, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ ఎస్‌.లింగారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు టి.వెంకట్‌రెడ్డి, తదితరులున్నారు.

Read more