బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి

Published: Sun, 26 Jun 2022 23:37:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధిపార్టీ జెండావిష్కరణలో మాట్లాడుతున్న డీకే అరుణ

- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

కోయిలకొండ, జూన్‌ 26 : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆదివారం మండ లంలోని గార్లపహాడ్‌, మల్కాపూర్‌, కేశవాపూర్‌, కోయిలకొండ, అంకిళ్ల గ్రామాల్లో పార్టీ జెండా కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. బీజేపీతోనే సంక్షేమం సాధ్యమవుతందన్నారు. కేసీఆర్‌ హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసగించారన్నారు. ప్రజలు మేల్కొని బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి, స్థానిక నాయకులు చెన్నయ్య, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.