టీడీపీ హయాంలోనే గ్రామాల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-06-29T04:46:06+05:30 IST

తెలుగుదేశం పార్టీ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని పార్టీ మండల అధ్యక్షుడు వేమూరి రామయ్య అన్నారు.

టీడీపీ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
పోతవరంలో టీడీపీ సభ్యత్వాలను నమోదు చేయిస్తున్న రామయ్య

పీసీపల్లి, జూన్‌ 28 : తెలుగుదేశం పార్టీ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి  చెందాయని పార్టీ మండల అధ్యక్షుడు వేమూరి రామయ్య అన్నారు. మండలంలోని పోతవరం గ్రామంలో మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. పెద్ద ఎత్తున యువకులు ఉత్సాహంగా వచ్చి  సభ్యత్వాలను స్వీకరించారు.  రామయ్య మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా డీప్‌బోర్లను ఏర్పాటు చేశారన్నారు. సీసీ రోడ్లు,  పాఠశాలలకు అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారని ఆయన గుర్తు చేశారు. వైసీపీ వచ్చిన మూడేళ్లలో ఎక్కడా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన ఆనవాళ్లు లేవన్నారు.  కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా నాయకులు వడ్డెంపూడి వెంకట్‌, కరణం శ్రీని వాసులు, ములకా నాగేశ్వరరావు, మహేంద్ర, చల్లా రవి, గుంటగాని జోసెఫ్‌, చల్లా సుధీర్‌, వేమూరి మాలకొండయ్య, వేముల వెంకటేశ్వర్లు, రావి వెంకటనారాయణ, పల్లా వెంకటేశ్వర్లు, వెంకటరాయుడు, వెంకటేశ్వర్లు, మురళి, నాగరాజు ఉన్నారు. అనంతరం రాత్రికి వైసీపీ బాదుడే బాదుడు నిర్వహించారు. కార్యక్రమంలో నాయ కులు హనుమారెడ్డి, మల్లికార్జున్‌, మాల్యాద్రి, మాచర్లు, వెంకటచౌదరి పాల్గొన్నారు. 

లక్ష్మక్కపల్లిలో..

లక్ష్మక్కపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు మంగళవారం సభ్యత్వ నమోదు  చేపట్టారు.  టీడీపీ గ్రామ నాయకులు కోటపాటి మాల్యాద్రి, మూలె మహేంద్రరెడ్డి  గ్రామంలో సభ్యత్వాన్ని నమోదు చేయించారు. గతంలో సభ్యత్వాలు తీసుకున్న వా రివి రెన్యువల్‌ చేశారు. కార్యక్రమంలో గోపి, వీరయ్య, యాకోబు, జేమ్స్‌, యో హోను, జకరయ్య, ఆంథోని, ఏసురత్నం, మాలకొండయ్య, రమేష్‌ రత్తయ్య  పాల్గొన్నారు.

సీఎస్‌పురంలో..

సీఎస్‌పురం : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని పార్టీ ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి దాసరి మల్లికార్జున పేర్కొ న్నారు. మండలంలోని బోడావు లదిన్నెలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బలహీన వర్గాలపై వైసీపీ దాడులు చేస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీ పాల కులకు బుద్ధి చెప్పాలని మల్లికార్జున కోరారు. కార్యక్రమంలో ఐ-టీడీపీ కోఆర్డీనేటర్‌ మాధినేని శ్రీనివాసులు, నాయకులు గోళ్ల తిరుపతయ్య, కె.వెంకటయ్య, యన్నం మాలకొండయ్య, యన్నం వేణు, మాలకొండయ్య, రాము, మహేష్‌, పెద్దయ్య, కొండలరావు, కొండయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-29T04:46:06+05:30 IST