వినూత్న పథకాలతో గ్రామాల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-01-24T04:36:16+05:30 IST

సీఎం కేసీఆర్‌ వినూత్న పథకాలతో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

వినూత్న పథకాలతో గ్రామాల అభివృద్ధి
గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

పటాన్‌చెరు, జనవరి 23 : సీఎం కేసీఆర్‌ వినూత్న పథకాలతో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కోటిన్నర నిధులతో నిర్మించిన పటేల్‌గూడ గ్రామపంచాయతీ భవనానికి ఆదివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, సర్పంచ్‌ ఈర్ల నితీషతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఒకప్పుడు గ్రామాలు చాలీచాలని నిధులతో ఎంతో దుర్భరంగా ఉండేవన్నారు. నిధులు లేక కనీసం పారిశుధ్య పనులు సైతం నిర్వహించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. నేడు గ్రామపంచాయతీలు అభివృద్ధికి కేరాఫ్‌ అడ్ర్‌సలుగా మారాయని చెప్పారు. సొంత గ్రామపంచాయతీ భవనాలు, పారిశుధ్య నిర్వహణకు ట్రాక్టర్లు, నర్సరీలు, డంపింగ్‌యార్డులను, శ్మశాన వాటికలను అభివృద్ధి చేశామన్నారు. గత పాలకుల వైఫల్యాలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటా గ్రామాల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పునాదులు వేస్తున్నదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఆధునిక హంగులతో కార్యాలయాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. గ్రామాల్లో నాయకులు పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఈర్ల నితీష, జడ్పీటీసీ గంగుల సుధాకర్‌రెడ్డి, కార్పొరేటర్‌ పుష్పనగేష్‌, ఎంపీపీ ఈర్ల దేవానంద్‌, ఉపసర్పంచ్‌ జానకీజ్ఞానేశ్వర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆదర్శరెడ్డి, పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T04:36:16+05:30 IST