అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్‌

Published: Tue, 16 Aug 2022 01:45:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్‌కలెక్టరేట్‌లో జెండాకు వందనం చేస్తున్న కలెక్టర్‌ హేమంత్‌పాటిల్‌

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌: జిల్లా అభివృద్ధే లక్ష్యంగా అధికారులు పని చేయాలని కలెక్టర్‌  పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నారు. సోమవారం ్ల కలెక్టరేట్‌లో పోలీస్‌ వందనం స్వీకరించి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ  సంక్షేమ పథకాలను అర్హులకు అందించాలన్నారు. అనంతరం విద్యార్థులకు నోట్‌బుక్స్‌ అందచేశారు. 

- జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎస్‌. రాజేంద్రప్రసాద్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

- కోదాడలో జాతీయ నాయకుల చిత్రపటాలకు ఎమ్మెల్యే  మల్లయ్య యాదవ్‌  పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. శ్రీచైతన్య విద్యార్థులు 50 మీటర్ల జాతీయ జెండాతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. 

- సూర్యాపేట జడ్పీ కార్యాలయంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక, వ్యవసాయ మార్కెట్‌ ఆవరణంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలితదేవి, బీజేపీ జిల్లా కార్యాల యంలో ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జల వెంకటరెడ్డి, సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగా ర్జునరెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. 

- సూర్యాపేట మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో  జాతీయ జెండాను ఎంపీపీ రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ కార్యాలయంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ జానయ్యయాదవ్‌ ఎగురవేశారు.  

- సూర్యాపేట మునిసిపల్‌ కార్యాలయంలో  జాతీయ జెండాను  మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, మునిసిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి ఎగురవేశారు.  

- జిల్లా గ్రంథాలయంలో జాతీయ జెండాను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌ ఆవిష్కరించారు. పబ్లిక్‌ క్లబ్‌లో పబ్లిక్‌ క్లబ్‌ కార్యదర్శి పెద్దిరెడ్డి గణేష్‌ ఆవిష్కరించారు జీ షాపింగ్‌ మాల్‌లో, గాంధీ పార్క్‌లో జాతీయ జెండాను వర్తక వ్యాపారం సంఘం నాయకలు గండూరి శంకర్‌ ఎగుర వేశారు.

- సూర్యాపేటలోని  పలు వార్డుల్లో  జాతీయ జెండాను టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌రమేష్‌రెడ్డి ఎగురవేశారు.

- జిల్లా కేంద్రంలోని ధర్మభిక్షం భవన్‌ జాతీయ జెండాను సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్‌,  అంజనాపురి కాలనీలో గిరిజన  విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు దరావత్‌ బాలునాయక్‌, వాణిజ్య భవన్‌లో ఎమ్మార్పీఎస్‌-టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌మాదిగ ఎగుర వేశారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.