ఖానాపూర్‌ మున్సిపాలిటీగా అవతరించిన నాటి నుంచే అభివృద్ధి

Published: Fri, 28 Jan 2022 00:12:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఖానాపూర్‌ మున్సిపాలిటీగా అవతరించిన నాటి నుంచే అభివృద్ధిఖానాపూర్‌లో కేక్‌ కట్‌ చేస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌

మున్సిపల్‌చైర్మన్‌ అంకం రాజేందర్‌

ఖానాపూర్‌, జనవరి 27 : మున్సిపాలిటీగా అవతరించిన నాటి నుంచే ఖానాపూర్‌ అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌ అన్నారు. మున్సిపాలిటీగా అవతరించి రెండేళ్ళు పూర్తైన సందర్భంగా మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో మున్సిపల్‌ పాలకవర్గం ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ పాలకవర్గం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ అబ్దుల్‌ ఖలీల్‌, కౌన్సిలర్‌లు కిషోర్‌నాయక్‌, కుర్మ శ్రీనివాస్‌, సంతోష్‌, కోఅప్షన్‌ సభ్యులు బండారి కిషోర్‌, నాయకులు జన్నారపు శంకర్‌, సుమన్‌, షభ్బీర్‌ పాషా, అమానుల్లాఖాన్‌, సంతోష్‌, పరిమి సురేష్‌ తదితరులున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.