రైతుల త్యాగాల వల్లే అభివృద్ధి: మంత్రి

ABN , First Publish Date - 2022-01-23T05:02:24+05:30 IST

రైతుల త్యాగాల ఫలితంగా పలు ప్రాంతాల అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తెలిపారు. శనివారం తహసీల్దార్‌ కార్యాలయంలో జగనన్న స్మార్ట్‌సిటీ, ఎంఐటీ లేఅవుట్లకోసం భూములు సేకరించిన రైతులకు పరిహారం చెక్కులు అందజేశారు.

రైతుల త్యాగాల వల్లే అభివృద్ధి: మంత్రి
పరిహారం చెక్కును అందజేస్తున్న అప్పలరాజు

పలాస రూరల్‌:  రైతుల త్యాగాల ఫలితంగా పలు ప్రాంతాల అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తెలిపారు. శనివారం తహసీల్దార్‌ కార్యాలయంలో జగనన్న స్మార్ట్‌సిటీ, ఎంఐటీ లేఅవుట్లకోసం  భూములు సేకరించిన రైతులకు పరిహారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ.. బొడ్డపాడు రైతులు చేసిన త్యాగాల ఫలితంగా భవి ష్యత్‌లో  నియో జకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. 152 ఎకరాలకు సంబంధించి 129 మంది రైతులకు ఎకరాకు రూ. 12,37, 500 చొప్పున రూ.18,78,26,400 అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌, తహసీల్దార్‌ ఎల్‌. మధుసూదనరావు, ఎంపీపీ ఉంగ ప్రవీణ, బొడ్డపాడు, మర్రిపాడు రైతులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-23T05:02:24+05:30 IST