జేపీతోనే తెలంగాణ అభివృద్ధి

Jun 17 2021 @ 00:11AM
ఈటల రాజేందర్‌కు మోదీ చిత్ర పటాన్ని బహూకరిస్తున్ననాయకులు

మేడ్చల్‌ అర్బన్‌: భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని బీజేపీ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల విక్రంరెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, ఇతర ముఖ్య నాయకులతో కలిసి మాజీ మం త్రి ఈటల రాజేందర్‌ను శామీర్‌పేట సమీపంలోని ఆయన నివాసంలో కలి సి పీఎం మోదీ చిత్రపటాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాజకీయ అనుభవం ఉన్న ఈటల రాజేందర్‌ చేరికను స్వాగతిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర ఎంతో ఉన్నదని, అందులోనూ చిన్నమ్మ దివ ంగత సుష్మాస్వరాజ్‌ ప్రత్యేకంగా వ్యవహరించారని గుర్తు చేశారు.

Follow Us on: