మహిళా సాధికారతతోనే అభివృద్ధి

ABN , First Publish Date - 2021-03-09T07:51:28+05:30 IST

మహిళా సాధికారితతోనే అభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ పిలుపునిచ్చారు.

మహిళా సాధికారతతోనే అభివృద్ధి
మాట్లాడుతున్న జిల్లాప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి, వేదికపై కలెక్టర్‌ భాస్కర్‌

కలెక్టర్‌ పోలా భాస్కర్‌

ఘనంగా మహిళా దినోత్సవం

ఒంగోలు(కల్చరల్‌), మార్చి 8: మహిళా సాధికారితతోనే అభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ పిలుపునిచ్చారు. ప్రకాశం భవన్‌లోని స్పందన సమావేశ మందిరంలో జిల్లా స్ర్తీ, శిశు అభివృద్ధి సంస్థ, డీఆర్‌డీఏ, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన దిశ చట్టం, యాప్‌ వలన మహిళలు రక్షణ పొందే అవకాశం ఉందన్నారు. రూ.2కోట్ల వ్యయంతో నిరాశ్రయ మహిళలకు శాశ్వత ప్రాతిపదికన రెస్క్యూహోం నిర్మించాల్సి ఉందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వి.జ్యోతిర్మయి మాట్లాడుతూ స్ర్తీలు, బలహీనవర్గాలు ఎన్నో రుగ్మతలను ఎదుర్కొంటున్నారని వారి అభివృద్ధికి చేయాల్సింది ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన్‌ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, జేసీ-3 కృష్ణవేణి, చైల్డ్‌వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ భారతీదేవి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నిర్మల, ఐసీడీఎస్‌ పీడీ లక్ష్మీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యరూపకం, దిశ చట్టంపై అవగాహన కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అడ్మినిస్ర్టేటివ్‌ అధికారి శ్రీనివాస్‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి.రత్నావళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కరోనా కష్టకాలంలో ఎంతో కష్టపడి సేవలందించిన మహిళా వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆమె ఈ సందర్భంగా సత్కరించారు. జిల్లా ఖజానా కార్యాలయంలోను మహిళా దినోత్సవ వేడుకలను ఏపీటీఎస్‌ఏ ప్రకాశం యూనిట్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మరోవైపు లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఒంగోలు సిటిజెన్స్‌ తరపున నగరపాలక సంస్థ ఏసీపీని ఘనంగా సత్కరించారు. 


Updated Date - 2021-03-09T07:51:28+05:30 IST