అభివృద్ధి పనులు త్వరిగతిన పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-01-22T04:20:32+05:30 IST

జిల్లా కేంద్రంలో చేస్తున్న అభివృద్ధి పనులను త్వరిగతిన పూర్తిచేయాలని కలె క్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని చిల్డ్రన్స్‌పార్కు, మినీథియేటర్‌ పనులను అధికా రులతో కలిసి పరిశీలించారు.

అభివృద్ధి పనులు త్వరిగతిన పూర్తి చేయాలి
చిల్డ్రన్స్‌ పార్కులో పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, జనవరి 21: జిల్లా కేంద్రంలో చేస్తున్న అభివృద్ధి పనులను త్వరిగతిన పూర్తిచేయాలని కలె క్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని చిల్డ్రన్స్‌పార్కు, మినీథియేటర్‌ పనులను అధికా రులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రజలకు అవసరమైన వినోదాన్ని అందజేయడానికి చిల్డ్రన్స్‌పార్కు, మినీ థియేటర్‌ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. చిల్డ్రన్స్‌ పార్కులో ఏర్పాటు చేసిన ట్రాక్‌ పరిశీలించి అధికారులకు పలుసూచనలు చేశారు.మినీ థియేటర్‌ పూర్తయితే ప్రజలకు వినోదం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పంచాయతీరాజ్‌ ఏఈ రాం కిరణ్‌, ఈవో వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T04:20:32+05:30 IST