Advertisement

అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

Sep 16 2020 @ 00:28AM

మేడ్చల్‌: మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేలా సర్పంచ్‌లు, కార్యదర్శులు కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి కోరారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో డీపీవో మండలంలోని సర్పంచ్‌లు, కార్యదర్శులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. గ్రామపంచాయతీ లేఅవుట్లలో ప్లాట్లు ఉన్న వారు తప్పనిసరిగా ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వైకుంఠధామం, కంపోస్టు తయారీ కేంద్రం, పల్లెప్రకృతి వనం, హరితహారం, ఇంకుడు గుంతలు, రైతు కల్లాలు తదితర అంశాలపై సర్పంచులకు అవగాహన కల్పించారు. సమావేశంలో ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి, ఎండీవో శశిరేఖ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు  తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
Advertisement
Advertisement