మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ఎమ్మెల్యే రవిశంకర్
కొడిమ్యాల, మార్చి 27: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను, ప్రజాసంక్షేమ పథకాలను సోష ల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెల్లాలని ఎమ్మెల్యే రవిశంక ర్, టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్రెడ్డ్డి కోరారు. ఆదివారం మండలంలో ని నాచుపల్లిలో టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్వై సోషల్ మీడియా నియోజకవర్గస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు వేర్వేరుగా మాట్లాడారు. నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తు న్న టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రజలకు మరింత చేరువ య్యేలా సోషల్ మీడియా విభాగం ముందుకు పోవాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు అజయ్గౌడ్, కరీంనగర్ జిల్లా కోఆర్డీనేటర్ యావ మధుసూదన్రెడ్డ్డి, సతీష్రెడ్డ్డి, సోషల్ మీడీయా నియోజకవర్గ ఇన్చార్జ్ రవీందర్ గౌడ్, ఆరు మండలాల టీఆర్ఎస్ యూత్ విద్యార్థి విభాగం నాయకులు లక్ష్మారెడ్డ్డి, అక్బర్, రాజ్కుమా ర్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.