అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-07-03T03:58:27+05:30 IST

గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అద నపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ సూచించారు. శని వారం చెన్నూరు ఎంపీడీవో కార్యాలయంలో చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవో, ఈజీఎస్‌ సిబ్బంది, కార్యదర్శులతో సమావేశం నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశు ధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలన్నారు.

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌

చెన్నూరు, జూలై 2: గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని  అద నపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ సూచించారు. శని వారం చెన్నూరు ఎంపీడీవో కార్యాలయంలో చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవో, ఈజీఎస్‌ సిబ్బంది, కార్యదర్శులతో సమావేశం నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశు ధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలన్నారు. వర్షాకా లంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలను అప్ర మత్తం చేయాలని, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. క్రీడా ప్రాంగణాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. హరితహారానికి నర్సరీల్లోని మొక్కలను సిద్ధంగా ఉంచాలన్నారు.  గ్రామాల్లో పన్నులను వంద శాతం వసూలు చేయా లని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించవ ద్దని సూచించారు. డీఆర్‌డీవో శేషాద్రి, డీపీవో నారా యణరావు, డీఎల్‌పీవో ప్రభాకర్‌, ఎంపీడీవోలు శ్రీని వాస్‌, భాస్కర్‌, లక్ష్మయ్య, ఎంపీవోలు అజ్మత్‌ ఆలీ, అక్తర్‌ మొహివుద్దీన్‌, శ్రీపతి బాపురావు పాల్గొన్నారు. 

పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలి 

జైపూర్‌: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామా ల్లో పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ సూచించారు.  మండల కేంద్రంలోని రైతు వేదికలో భీమారం, జైపూర్‌ మండలాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రోజు గ్రామాల్లో పారిశుధ్య పనులను నిర్వహించాలని, చెత్తాచెదారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడా ప్రాంగణాల పనుల ను త్వరగా పూర్తి చేయాలని, ఉపాధిహామీలో కూలీ లకు పెద్ద సంఖ్యలో పనులను కల్పించాలన్నారు. హరి తహారం కార్యక్రమానికి నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని, మొక్కలను నాటేందుకు గుంతలను తవ్వి ఉంచాలని పేర్కొన్నారు. అడిషనల్‌ డీఆర్‌డీవో దత్త రావు, ఎంపీడీవోలు సత్యనారాయణ,  శ్రీనివాస్‌, ఎంపీ వోలు అనిల్‌కుమార్‌, సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. 

దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలి

హాజీపూర్‌: దళితబంధును లబ్ధిదారులు సద్విని యోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ పేర్కొన్నారు. శనివారం గుడిపేటలో గల జిల్లా పశువైద్యాధికారి కార్యాలయంలో దళితబంధు పథకం పాడి పశువుల లబ్ధిదారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. పశు పోషణపై అవగాహన కలిగి ఉండాలని, పశువుల కొనుగోళ్ల విష యంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా పశువైద్యాధికారి శంకర్‌, లబ్ధిదారులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-07-03T03:58:27+05:30 IST