ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అభివృద్ధి పనులు

ABN , First Publish Date - 2020-08-06T06:28:50+05:30 IST

నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు నగరవ్యాప్తంగా అభివృద్ధి పనులు చేపడగామని మేయర్‌ సునీల్‌రావు తెలిపారు.

ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అభివృద్ధి పనులు

మేయర్‌ వై సునీల్‌రావు


కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 5: నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు నగరవ్యాప్తంగా అభివృద్ధి పనులు చేపడగామని మేయర్‌ సునీల్‌రావు తెలిపారు. బుధవారం కిసాన్‌నగర్‌లో కార్పొరేటర్‌ కంసాల శ్రీనివాస్‌తో కలిసి రూ.5లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు, డ్రెయినేజీ, క్రాస్‌ కల్వర్టు, స్లాబ్‌ పనులకు మేయర్‌ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ప్రారంభించిన పనులను త్వరగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.


గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్క నాటిన మేయర్‌..

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ చేసిన గ్రీన్‌ఛాలెంజ్‌ను మేయర్‌ వై సునీల్‌ రావు స్వీకరించి బుధవారం భగత్‌నగర్‌ వాటర్‌ ట్యాంకులో మామిడి మొక్కను నాటారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్‌, కలెక్టర్‌ కె శశాంక, కమిషనర్‌ వల్లూరు క్రాంతికి గ్రీన్‌ ఛాలెంజ్‌ చేశారు.

Updated Date - 2020-08-06T06:28:50+05:30 IST