అభివృద్ధి పనుల్లో రాజానగరం ముందంజ

ABN , First Publish Date - 2022-01-22T05:30:00+05:30 IST

అభివృద్ధిపరంగా జిల్లాలో రాజాన గరం నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అన్నారు.

అభివృద్ధి పనుల్లో రాజానగరం ముందంజ
వలంటీర్లకు బీమా పత్రాలు అందజేస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే రాజా

  • జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌
  • పుణ్యక్షేత్రం, కొత్తతుంగపాడు గ్రామాల్లో పర్యటన

రాజానగరం/దివాన్‌చెరువు, జనవరి 22: అభివృద్ధిపరంగా జిల్లాలో రాజానగరం నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అన్నారు. మండలంలోని పుణ్యక్షేత్రం, కొత్తతుంగపాడు గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్మించిన సచివాల యాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాలను స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, వైఎస్‌ ఆర్‌ హెల్త్‌క్లినిక్‌, బీఎంసీయూల నిర్మాణాల్లో రాజానగరం ముందంజలో ఉందన్నారు. కొత్తతుంగపాడు, పుణ్యక్షేత్రం గ్రామాల్లో తాను ప్రారంభించిన భవ నాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. పుణ్యక్షేత్రం సచివాలయం ఏఎన్‌ ఎంతో మాట్లాడుతూ ఈ నూతన భవనంలో వెంటనే నివాసం ఏర్పాటుచేసు కుని ఆ ఫొటోలను తనకు పంపించాలని చెప్పారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అభివృద్ధిలో కీలకభూమిక పోషించడం వల్లనే నియోజకవర్గం ముందంజలో నిలపడంలో సఫలీకృతులమయ్యామన్నారు. పుణ్యక్షేత్రం సచివాలయంలో సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయం రానుందన్నారు. 

వలంటీర్లకు బీమా రాష్ట్రంలోనే తొలిసారి..

రాజానగరంలోని ఒక ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటుచేసిన బాండ్ల పంపిణీ సభలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోనే తొలిసారిగా వలంటీర్లకు ఎమ్మెల్యే రాజా వ్యక్తిగత బీమా పథకానికి రూపకల్పన చేయడం అభినందనీయమన్నారు. ఇటీవల సీతానగరం మండలం వంగలపూడికి చెందిన వలంటీరు నీలారాణి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆమె కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవా లనే సంకల్పంతో ఎమ్మెల్యే రాజా వలంటీర్ల ప్రమాద బీమా పథకానికి రూపక ల్పన చేశారన్నారు. నియోజకవర్గంలో 1475 మంది వలంటీర్లకు మూడేళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా బీమా ప్రీమియాన్ని జక్కంపూడి ఫౌండేషన్‌ ద్వారా చెల్లిం చడం హర్షణీయమన్నారు. ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ వలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శమన్నారు. అనంతరం న్యూ ఇండియా ఇన్సూరెన్సు కంపెనీ వారు జారీచేసిన వ్యక్తిగత ప్రమాద బీమా బాండ్లను కలెక్టర్‌ వలంటీర్లకు అందజేశా రు. ఆయా కార్యక్రమాల్లో రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ ఇలాక్కియా, నియోజ కవర్గ ప్రత్యేకాధికారి ముక్కంటి, ఎంపీపీ మండారపు సీతారత్నం, జడ్పీటీసీ సభ్యుడు పెద్ద వెంకన్న, మండల కన్వీనర్లు డాక్టర్‌ బాబు, ఉల్లి బుజ్జిబాబు, మం డల ప్రత్యేకాధికారి కె.మయూరి, సర్పంచ్‌లు మరుకుర్తి వెంకటేశ్వరరావు, కోల పాటి వెంకన్న, నాయకులు మండారపు వీర్రాజు, వేమగిరి కృష్ణ, ప్రగడ చక్రి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST