Aurangzeb ఆనవాళ్లపై కుక్క కూడా విసర్జన చేయదు: Owaisiపై Fadnavis విమర్శలు

ABN , First Publish Date - 2022-05-16T18:04:12+05:30 IST

కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కలయికలో ఉన్న మహా వికాస్ అగాడి ప్రభుత్వం Babri మసీదు వంటిదని, దాన్ని కూల్చే వరకు తాను విశ్రమించనని ఫడ్నవీస్ అన్నారు. ఇక కొద్ది రోజుల క్రితం Aurangzeb సమాధికి AIMIM అధినేత Asaduddin Owaisi..

Aurangzeb ఆనవాళ్లపై కుక్క కూడా విసర్జన చేయదు: Owaisiపై Fadnavis విమర్శలు

ముంబై: Maharashtra Opposition Leader Devendra Fadnavis వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటారు. విపక్ష పార్టీలపై నేతలపై ఆయన చేసే విమర్శలు సైతం సున్నితంగా ఉంటాయని అంటుంటారు. అలాంటి ఉన్నట్టుండి ఆయన విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన Mahasankalp Sabhaలో పాల్గొన్న ఆయన బాబ్రి, ఔరంగాజేబులను ప్రస్తావిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వంపై ఓవైసీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. BJP నేతలకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అలవాటే అయినప్పటికీ.. ఫడ్నవీస్ ఈ విధంగా స్పందించడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని కొంతమంది నెటిజెన్లు అంటున్నారు.


కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కలయికలో ఉన్న మహా వికాస్ అగాడి ప్రభుత్వం Babri మసీదు వంటిదని, దాన్ని కూల్చే వరకు తాను విశ్రమించనని ఫడ్నవీస్ అన్నారు. ఇక కొద్ది రోజుల క్రితం Aurangzeb సమాధికి AIMIM అధినేత Asaduddin Owaisi నివాళులు అర్పిండచాన్ని ప్రస్తావిస్తూ ఔరంగాజేబు ఆనవాళ్లపై కుక్క కూడా విసర్జన చేయదని అన్నారు. బాంద్రాలో Uddhav Thackeray నిర్వహించిన ర్యాలీని కామెడీ ర్యాలీ అంటూ ఫడ్నవీస్ విమర్శించారు.


‘‘హనుమాన్ చాలీసా చదివినందుకు కేసులు పెడుతున్నారు. తన కొడుకు అధికారంలో ఉండగా హనుమాన్ చాలీసా చదివడం నేరమని ఔరంగాజేబును గౌరవించాలని బాలాసాహేబ్ థాకరే ఊహించి ఉండరు. అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడికి వచ్చి ఔరంగాజేబుకు నివాళులు అర్పించారు. ఔరంగాజేబు ఆనవాళ్లపై కుక్క కూడా విసర్జన చేయదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి సిగ్గనిపించడం లేదు. ఏది ఏమైనా ఈ దేశాన్ని కాషాయమే ఏలుతుంది’’ అని ఫడ్నవీస్ అన్నారు.

Updated Date - 2022-05-16T18:04:12+05:30 IST