విత్తనాలు అమ్మారు... ధాన్యం కొనుగోలు చేయరా? దేవినేని ఉమ

ABN , First Publish Date - 2021-05-07T20:43:43+05:30 IST

వ్యవసాయ శాఖ తీరుపై టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనాలు అమ్మారని

విత్తనాలు అమ్మారు... ధాన్యం కొనుగోలు చేయరా? దేవినేని ఉమ

అమరావతి : వ్యవసాయ శాఖ తీరుపై టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనాలు అమ్మారని, కానీ ధాన్యం కొనరా? అని సూటిగా ప్రశ్నించారు. వ్యవసాయ శాఖ, ఆర్‌బీఏకు మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ శాఖలు విత్తనాలు అమ్మితే, ధాన్యం కొనుగోలు చేయకపోవటం విడ్డూరమన్నారు. రోడ్లమీదే ధాన్యపు రాశులున్నాయని, కానీ కొనే దిక్కు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బస్తాకు 900 రూపాయలను అడుగుతున్నారని, మిగతా నష్టం ఎవరు భరిస్తారని ఆయన నిలదీశారు. సీఎం జగన్‌కు అసలు రైతుల కష్టాలు కనబడుతున్నాయా? అని దేవినేని ఉమ సూటిగా ప్రశ్నించారు. 

Updated Date - 2021-05-07T20:43:43+05:30 IST