AP News: తొడ కొట్టి చెబుతున్నా.. దేవినేని ఉమ

ABN , First Publish Date - 2022-09-13T22:42:01+05:30 IST

Amaravathi: మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Naani) గత కొంతకాలంగా టీడీపీ (TDP) నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. టీడీపీ అంటేనే ఒంటి కాలిపై లేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు (Devineni Uma) హాజరయ్యారు. కొడాలి నానిని ఓడిస్తామంటూ సమావేశంలో ఆయ

AP News: తొడ కొట్టి చెబుతున్నా.. దేవినేని ఉమ

Amaravathi: మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Naani) గత కొంతకాలంగా టీడీపీ (TDP) నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. టీడీపీ అంటేనే ఒంటి కాలిపై లేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు (Devineni Uma) హాజరయ్యారు. కొడాలి నానిని ఓడిస్తామంటూ సమావేశంలో ఆయన తొడ కొట్టారు. గుడివాడ టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావుతో కూడా తొడ కొట్టించారు. ‘‘కొడాలి నాని, వంశీ, అవినాష్‌ను తరిమికొడతాం. దేవినేని అవినాష్ రాజకీయ జీవితం ముగిసిపోయింది. ఎన్టీఆర్ బిడ్డ, చంద్రబాబు (Chandra babu) కుటుంబం మీద ఇష్టారాజ్యంగా మాట్లాడిన వీళ్లకు ఇబ్బందులు తప్పవు.’’ అని దేవినేని హెచ్చరించారు. 

Updated Date - 2022-09-13T22:42:01+05:30 IST