అనుమతితో పనిలేకుండా అప్పులు చేస్తున్న ఏపీ సర్కార్: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2022-02-09T17:38:30+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అనుమతితో పనిలేకుండా అప్పులు చేస్తున్న ఏపీ సర్కార్: దేవినేని ఉమ

విజయవాడ: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అనుమతితో పనిలేకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని ఆరోపించారు. రుణసేకరణలో నిబంధనలు బేఖాతర్ చేస్తూ.. అదనపు అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తోందన్నారు. సీఎం జగన్ అన్నినిధులూ దారిమళ్లిస్తూ.. పాలనా వైఫల్యంతో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి నిండాముంచేశారని మండిపడ్డారు. చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.


‘‘మా రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వండి. మా ప్రాజెక్టులకు అనుమతులివ్వండి. మా రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేలా చూడండి’’... ఏ ముఖ్యమంత్రైనా ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిసినప్పుడు కోరేది ఇవే! కానీ... మన రాష్ట్రం తీరే వేరు! ‘‘మాకు అప్పులు ఇవ్వండి. అదనపు అప్పులకు అనుమతిఇవ్వండి. మా అప్పులకు అడ్డులేకుండా చూడండి’’... కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ కోరుతున్నది ఇదే! తప్పుడు మార్గాల్లో అప్పుల మీద అప్పులు చేస్తున్న వైసీపీ సర్కారుకు అవేవీ చాలడంలేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు రూ.27,325 కోట్ల అదనపు అప్పులకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని జగన్‌ కోరారు. ఈ విషయాన్ని కేంద్రమే పార్లమెంటులో వెల్లడించింది. అంతేకాదు... గతనెల 3వ తేదీన జగన్‌ అప్పులకు అనుమతి కోరేందుకే ఢిల్లీకి వచ్చారని తెలిపింది. రెండున్నరేళ్లుగా జగన్‌ సర్కారు అప్పులు చేయడమే పనిగా పెట్టుకుంది. ఆ అప్పుల అసలు, వడ్డీలు చెల్లించడానికే ఖజానా సరిపోవడంలేదు. ‘తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. 

Updated Date - 2022-02-09T17:38:30+05:30 IST