AP News: జగన్‌ సర్కార్‌పై దేవినేని విమర్శలు

ABN , First Publish Date - 2022-08-14T22:16:18+05:30 IST

జగన్‌ సర్కార్‌పై మాజీమంత్రి దేవినేని ఉమ (Devineni Uma) విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

AP News: జగన్‌ సర్కార్‌పై దేవినేని విమర్శలు

అమరావతి: జగన్‌ సర్కార్‌పై మాజీమంత్రి దేవినేని ఉమ (Devineni Uma) విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరి దుర్మార్గమన్నారు. ఎన్నికల ముందు వారిని రెగ్యులరైజ్ చేసి జీతాలు పెంచుతామన్నారని, నేడు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగాలూ పీకేస్తున్నారని మండిపడ్డారు. వారికి జీతాలు చెల్లించకుండా, ప్రభుత్వ పథకాల్లోనూ కోతలు పెట్టారని విమర్శించారు. దీనిపై కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ (Jagan) సమాధానం చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-08-14T22:16:18+05:30 IST