మోసపోయిన ఆర్టీసీ ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-07-02T07:00:52+05:30 IST

మళ్లీ ఆరీ్టీస బాదుడు ప్రారంభమైందని, సామాన్యులు బస్సు ఎక్కలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం చార్జీలను అడ్డగోలుగా పెంచడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అన్నారు.

మోసపోయిన ఆర్టీసీ ఉద్యోగులు

మాజీమంత్రి దేవినేని ఉమా ధ్వజం

మైలవరం, జూలై 1 : మళ్లీ ఆరీ్టీస బాదుడు ప్రారంభమైందని, సామాన్యులు బస్సు ఎక్కలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం చార్జీలను అడ్డగోలుగా పెంచడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అన్నారు. శుక్రవారం పట్టణ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ.26 కోట్లతో విమానం వేసుకొని పారిస్‌ వెళ్లిన జగన్మోహన్‌రెడ్డి సామాన్యుడి నడ్డివిరిచేలా అన్ని పన్నులు పెంచి ప్రజలను రోడ్డున పడేశారని విమర్శించారు. కిలో మీటరుకు 10 పైసలు, ఏసీ అయితే 20పైసలు డీజిల్‌ సెస్‌ అని మాయమాటలు చెప్పి రూ.2175 కోట్లు భారం వేశారని మండిపడ్డారు. గతంలో పెంచినప్పుడు రూ.675 కోట్లు భారం పడింది. దగ్గర దగ్గర రూ.3వేల కోట్ల భారం పడిందన్నారు. సామాన్యుడి వాహనం ఆర్టీసీ, అలాంటి పల్లె వెలుగు బస్సుపై జగన్‌రెడ్డి ప్రతాపం చూపుతున్నారన్నారు. ఒక బాబాయ్‌ టీటీడీ చైర్మన్‌, ఇంకో బాబాయ్‌ ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్నారన్నారు. మల్లిఖార్జునరెడ్డి చైర్మన్‌, బ్రహ్మానందరెడ్డి ఈడీ ఆపరేషన్‌, రాఘవరెడ్డి ఫైనాన్షియల్‌ ఎడ్వైజర్‌, కడప గోపినాథ్‌రెడ్డి ఈ నలుగురు ఒక దుష్ట చతుష్టయంలా ఆర్టీసీ మొత్తం వీళ్ల చేతుల్లో పెట్టుకుని అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. విలువైన ఆర్టీసీ స్థలాలు గ్రామాల్లో, నగరాల నడిమధ్యలో ఉన్నాయని, వాటిని కొట్టేయాలన్న ఆలోచనతో 33ఏళ్లు లీజు తీసుకోవాలన్న దుర్మార్గ ఆలోచనతో ప్లాన్‌ చేసి ఆర్టీసీ ఉద్యోగులను నమ్మించారన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మోసపోయిన వాళ్లెవరంటే ఆర్టీసీ కార్మికులేనన్నారు. ఈరోజు ఒక కుటుంబంలో నలుగురు ఆర్టీసీ బస్సులో తిరుపతి కొండ వెళ్లి రావాలంటే రూ.1000 భారం పడుతుందన్నారు. 51,690 మంది ఆర్టీసీ ఉద్యోగులు, 7,500 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పెన్షన్‌ ఇస్తానని నమ్మబలికి ఈరోజున రోడ్డుపై పడేశారన్నారు. ఏ హాస్పటల్‌కి వెళ్లినా ఈఎ్‌సఐ కార్డు పనిచేయటం లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చూడనవి ఏమైనా ఉంటే రిఫరల్‌ ఆస్పత్రికి పంపి కార్మికులను బిడ్డల్లాగా చంద్రబాబు కాపాడితే గొర్రె కసాయిని నమ్మినట్లు జగన్‌రెడ్డిని నమ్మి మోసపోయారన్నారు. ఖరీఫ్‌ మొదలైనా సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం కాదని, వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి ఉరితాడు వేస్తున్నాడని మండిపడ్డారు. ఈ భారం గురించి బాదుడే బాదుడులో భాగంగా అన్ని గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ చైతన్యం తీసుకువస్తామన్నారు. ఒక్క రోడ్డు వేశారా, ఒక గుంత పుడ్చారా అని ప్రశ్నించారు. పాతయాత్రకు పోటీగా ప్లీనరీ పెట్టి బొర్లా పడ్డారని, ప్లీనరీ వెలవెల పోతుంటే, పాదయాత్ర జయప్రదమైందన్నారు. పోలవరం మట్టి, కొండపల్లి అడవి, షాబాద, జక్కంపూడి కొండలు కొట్టేశారన్నారు. వీటీపీఎస్‌ బూడిద పందికొక్కుల్లా తినేశారని ఎమ్మెల్యే బావమరిది, అనుచరులు చెరువుల్లో మట్టి దోచేశారని, మీ నేతలు గణపవరంలో పార్టీ ఫండ్‌ కింద రూ.50లక్షలు దోచుకుని, లక్షల వద్ద కుమ్ములాటలు వచ్చి వాట్సాప్‌ గ్రూపుల్లో పెట్టుకున్నారన్నారు. రూ.50లక్షలు పార్టీ ఫండ్‌ ఏంటో, 100 ట్రాక్టర్లు, 10 జేసీబీలు కనిపించడం లేదన్నారు. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందన్నారు. అనంతరం నేతలు, కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు మల్లెల రాధాకృష్ణ, పార్టీ నేతలు గంజి రామకృష్ణారెడ్డి, సుభాని, లంకా లితీష్‌, కన్నయ్య, జల్లి కృష్ణ, జానీ, షహనాబేగం, రోశయ్య, ప్రేమ్‌సాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T07:00:52+05:30 IST