రాజమండ్రి జైలుకు దేవినేని ఉమ!

ABN , First Publish Date - 2021-07-28T23:55:19+05:30 IST

టీడీపీ నేత దేవినేని ఉమను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. హనుమాన్‌ జంక్షన్‌ పోలీస్‌స్టేషన్‌లో జూమ్‌ యాప్‌ ద్వారా..

రాజమండ్రి జైలుకు దేవినేని ఉమ!

అమరావతి: టీడీపీ నేత దేవినేని ఉమను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. హనుమాన్‌ జంక్షన్‌ పోలీస్‌స్టేషన్‌లో జూమ్‌ యాప్‌ ద్వారా.. ఆయనను ఆన్‌లైన్‌లో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఉమకు మైలవరం జడ్జి షేక్ షేరిన్ 14 రోజులు రిమాండ్ విధించారు. దేవినేని ఉమను రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. దేవినేని ఉమపై మొత్తంగా 12 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 158, 147, 148, 341, 323, 324, 307, 427, 506, 353, 332, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంతకుముందు భారీ భద్రత మధ్య మాజీ మంత్రి దేవినేని ఉమను మైలవరం కోర్టుకు తరలించారు. ఉమను కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు.

Updated Date - 2021-07-28T23:55:19+05:30 IST