దేవిరెడ్డి శ్రీలక్ష్మి
కడప(కలెక్టరేట్), జనవరి 21: అన్నమయ్య అర్బన డెవలప్మెంట్ అథారిటీ (అడా) వైస్ చైర్‌పర్సనగా దేవిరెడ్డి శ్రీలక్ష్మి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇనచార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న జాయింట్ కలెక్టర్ ఎం.గౌతమి నుంచి ఈమె శుక్రవారం బాఽధ్యతలు స్వీక రించారు. ఈమె 2022వ సంవత్సరంలో ఎస్జీటీగా, 2004లో స్కూల్ అసిస్టెంట్‌గా, 2006లో జూనియర్ లెక్చరర్‌గా, 2007లో గ్రూప్-1 అధికారిగా నియమితులయ్యారు. కడప, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లలో డిప్యూటీ కమిషనర్‌గా, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ కమిషనర్‌గా, కడప ఎస్సీ కార్పొరేషన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, అడాలో సెక్రటరీగా పనిచేశారు.