Sherannavaratri celebrations: శ్రీశైలంలో వైభవంగా దేవిశరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-26T17:43:36+05:30 IST

శ్రీశైలంలో దసరా దేవిశరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

Sherannavaratri celebrations:  శ్రీశైలంలో వైభవంగా దేవిశరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం

నంద్యాల: శ్రీశైలంలో దసరా దేవిశరన్నవరాత్రి మహోత్సవాలు (Devi sharannavaratri celebrations) వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈవో లవన్న ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, సభ్యులు.. అమ్మవారికి  ప్రత్యేక పూజలు నిర్వహించి దసరా ఉత్సవాలను మొదలుపెట్టారు. శైలపుత్రిగా శ్రీశైలం భ్రమరాంబికాదేవి అమ్మవారు భక్తులకు దర్శనమివనున్నారు. సాయంత్రం శ్రీశైల పురవీధులలో బృంగివహంపై స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం జరుగనుంది. అక్టోబరు 4 మహర్నవమిరోజు రాష్ట్ర ప్రభుత్వంచే స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ జరుగనుంది. ఉత్సవాల సమయంలో స్వామి అమ్మవారి అభిషేకం, కుంకుమార్చన, కల్యాణోత్సవం యథావిధిగా కొనసాగనుంది. భక్తులు నిర్వహించే ఆర్జితసేవలలో చండీహోమం, రుద్రహోమం, మృత్యుంజయహోమాన్ని ఆలయ అధికారులు నిలుపివేశారు. నేటి నుంచి వివిధ అలంకార రూపాలలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈరోజు  అక్టోబర్ 5 వరకు ప్రతిరోజు వివిధ వాహనసేవలలో స్వామి అమ్మవారికి క్షేత్రపురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నారు. 

Updated Date - 2022-09-26T17:43:36+05:30 IST