సూపర్‌గా సింక్‌ అయింది: దేవిశ్రీప్రసాద్‌

Jun 15 2021 @ 19:58PM

‘ఆర్య’ సినిమాలో 'అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహాపురం’ పాట ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే! ఇప్పుడా పాటన్‌ ఫన్నీగా రీ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో వదిలారు అభిమానులు. పాటలో పదాలను.. పలు చిత్రాల్లోని కామెడీ బిట్‌లతో సింగ్‌ చేసి ఓ వీడియోగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ‘ఆర్య’కు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ చెంతకు ఈ వీడియో చేరింది. ఆయన దానిని ట్విట్టర్‌లో షేర్‌ చేసి ‘ఎవరు ఎడిట్‌ చేశారో తెలీదు. బ్రిలియంట్‌గా ఉంది. పాటకి పదాలకి సూపర్‌గా సింగ్‌ అయింది. వీడియో చూసి ఎంతో నవ్వుకున్నా. నాకెంతో నచ్చింది’’ అని రాసుకొచ్చారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.