Advertisement

నాయినోనిపల్లి మైసమ్మ దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

Jan 24 2021 @ 21:43PM
మైసమ్మ దేవత దర్శనం చేసుకుంటున్న భక్తులు

పెద్దకొత్తపల్లి, జనవరి 24: భక్తుల కొంగు బంగారంగా వెలిసిన నాయినోనిపల్లి మైసమ్మ దేవత దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల నుంచే కాక తెలంగాణ ప్రాంతంలోని  నలుమాల నుంచి ఆదివారం దాదాపు 40 వేలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఆదివారం అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలి వస్తుంటారు. భక్తుల నుంచి మైసమ్మ దేవత ఆలయానికి  దాదాపు రూ.2 లక్షల ఆదాయం వచ్చినట్టు దేవాలయ చైర్మన్‌ శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. భక్తులకు అవసరమైన వసతులు కల్పించినట్లు ఆయన తెలిపారు.


Follow Us on:
Advertisement