రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-05-26T05:56:27+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో భక్తులు పోటెత్తారు.

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు

- బారులుతీరిన భక్తులు

వేములవాడ టౌన్‌, మే 25: వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. హనుమాన్‌ జయంతిని పురష్కరించుకుని బుధవారం భక్తులు రాజన్నను దర్శించుకునేందుకు క్యూలైన్‌లలో బారులు తీరారు. స్వామివారికి తలనీలాలను సమర్పించి ఆయా క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకునానరు. స్వామివారికి కోడెమొక్కు చెల్లించుకున్నారు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని హనుమాన్‌ దీక్షాపరులు రాజన్నను దర్శించుకుని అనంతరం కొండగట్టు ఆలయానికి మాలవిరమణ కోసం తరలివెళ్లారు. రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆలయ ఈవో రమాదేవి ఆలయ పరిసరాలను, క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాజన్న ఆలయానికి సుమారుగా 15 వేల మంది భక్తులు రాగా ఆలయ ఖజానాకు 10 లక్షల రూపాయల ఆదాయం సమకూరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.


Updated Date - 2022-05-26T05:56:27+05:30 IST