పోతురాజు ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి
కెరమెరి, జనవరి 28: మండలంలోని ఇందాపూర్ సమీపంలో పోతురాజు ధర్మరాజు ఆలయ సమీపంలో శుక్రవారం నుంచి జాతర ప్రారంభమైంది. ఈ జాత రకు వివిధ గ్రామాల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, యువతులు, పిల్లపాపలతో కలిసి డోలు వాయిద్యాలతో సంప్ర దాయ నృత్యాలు చేశారు. మహిళా కమిషన్ సభ్యు రాలు కుమ్ర ఈశ్వరీ బాయి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లా డుతూ కొలాం తెగల కొంగు బంగారంగా విల సిల్లుతున్న పోతురాజు ధర్మరాజు జాతరను నిర్వహించడం ఎన్నోఏళ్లుగా అనవాయితీగా వస్తోంద న్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను ప్రారంభించారు. అనంతరం ధరోన గ్రామంలోని జంగుబాయి దేవత వద్ద పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతీరాం, జడ్పీటీసీ ధ్రుపతాబాయి, ఎమ్మెల్యే తనయుడు వినోద్, సర్పంచ్లు తులసీరాం, జగన్నాథ్రావు పాల్గొన్నారు.
నాగోబా దేవస్థానానికి తరలిన మెస్రం వంశీయులు
లింగాపూర్: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా దేవస్థానానికి శుక్రవారం మండలంలోని మానుకుగూడ, లింగాపూర్లోని మెస్రం వంశీ యులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా పటేల్ గంగు మాట్లాడుతూ ప్రతిసంవత్సరంలాగే ఈ ఏడాది కూడా మెస్రం వంశీయుల ఆధ్వర్యం లో కేస్లాపూర్ నాగోబా జాతర చాలాపెద్దఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు. అన్నిరాష్ట్రాలు, జిల్లాల్లోని మెస్రం వంశీయులు హాజరై పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.