తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-04-15T01:13:55+05:30 IST

తిరుమలలో గురువారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. వరుస సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో  గురువారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. వరుస సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండాయి. వీరికి దాదాపు 10 గంటల దర్శనం సమయం పడుతోంది. రాబోయే మూడురోజులు కూడా సెలవుదినాలు కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశాలున్నాయి. శ్రీవారిని బుధవారం 88,748 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 47వేల మంది టోకెన్‌ రహిత భక్తులుండడం గమనార్హం. అలాగే ముందస్తుగా ఆన్‌లైన్‌ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తీసుకున్న మరో 26వేల మంది కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ఆర్జితసేవ, వర్చువల్‌ సేవా టికెట్లు, టూరిజం శాఖ ద్వారా వచ్చిన మరికొందరికి కూడా దర్శనం చేయించారు. మొత్తం మీద బుధవారం వేకువజాము నుంచి అర్థరాత్రి వరకు 88,748 మందికి శ్రీవారి దర్శనం లభించింది. అలాగే రూ.4.82 కోట్ల హుండీ ఆదాయం లభించగా, 38,558 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. 

Updated Date - 2022-04-15T01:13:55+05:30 IST