Tirumalaలో పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-05-27T02:59:21+05:30 IST

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి తిరుమల కొండకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది.

Tirumalaలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి తిరుమల కొండకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండిపోయి క్యూలైన్‌ రాంభగీచా వరకు దాదాపు రెండు కిలోమీటర్లు మేర వ్యాపించింది. సర్వదర్శనానికి దాదాపు 17 గంటల సమయం పడుతోంది. మరోవైపు పెరిగిన భక్తుల రద్దీతో శ్రీవారి ఆలయం మొదలుకొని మాడవీధులు, అఖిలాండం, లడ్డూకౌంటర్‌, కాటేజీలు, బస్టాండ్‌, అన్నప్రసాద భవనం వంటి ప్రాంతాలు కిక్కిరిపోయాయి. గదులకు డిమాండ్‌ కొనసాగుతోంది. సీఆర్వో, ఎంబీసీ, గదుల రిజిస్ర్టేషన్‌ కౌంటర్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.గదిని పొందేందుకు దాదాపు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. మరోవైపు కల్యాణకట్టలు కూడా యాత్రికులతో కిక్కిరిసిపోయాయి. 

Updated Date - 2022-05-27T02:59:21+05:30 IST