సెకండ్‌ వేవ్‌ పట్టని భక్తులు

ABN , First Publish Date - 2021-03-02T06:43:44+05:30 IST

వదల బొమ్మాళీ.. నిను వదలా అంటూ కరోనా మహమ్మారి ఏడాది కాలంగా అందరినీ వణికిస్తోంది. అన్ని వర్గాలను కోలుకోకుండా దెబ్బతీసింది. కరోనా ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే రెండో వేవ్‌గా పలు రాష్ట్రాల్లో మళ్లీ విజృంభిస్తోంది. అయితే ఏడాది కాలంగా కరోనాతో చాలా కుటుంబాలు ఆరోగ్యపరంగా ఆర్థికంగా చితికాయి. లక్షల మంది ఉపాధి కోల్పోయారు. కాగా, ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గిందనే భావనతో ప్రజలు కనీస జాగ్రత్తలు, నిబంధనలు మరిచారు.

సెకండ్‌ వేవ్‌ పట్టని భక్తులు
మాస్క్‌లు, భౌతికదూరం లేకుండా బాలాలయం క్యూలైన్‌లో కిక్కిరిసిన భక్తులు

మాస్క్‌లు, భౌతికదూరం నిల్‌

శానిటైజేషన్‌ మరిచిన అధికారులు

యాదాద్రి, మార్చి1(ఆంధ్రజ్యోతి): వదల బొమ్మాళీ.. నిను వదలా అంటూ కరోనా మహమ్మారి ఏడాది కాలంగా అందరినీ వణికిస్తోంది. అన్ని వర్గాలను కోలుకోకుండా దెబ్బతీసింది. కరోనా ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే రెండో వేవ్‌గా పలు రాష్ట్రాల్లో మళ్లీ విజృంభిస్తోంది. అయితే ఏడాది కాలంగా కరోనాతో చాలా కుటుంబాలు ఆరోగ్యపరంగా ఆర్థికంగా చితికాయి. లక్షల  మంది ఉపాధి కోల్పోయారు. కాగా, ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గిందనే భావనతో ప్రజలు కనీస జాగ్రత్తలు, నిబంధనలు మరిచారు.

ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు

కరోనా కాలంలో దైవ దర్శనాలకు జంకిన భక్తులు ఇప్పుడు ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఆలయాల వద్ద పెద్ద సంఖ్యలో గుంపులుగా ఉంటూ భౌతికదూరం పాటించడం లేదు. నూటికి 10 మంది కూడా మాస్క్‌లు ధరించడం లేదు. శానిటైజేషన్‌ విషయాన్నే పూర్తిగా మరిచారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆలయాల వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులను అనుమతించాలి. దీన్ని అధికారులు విస్మరించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద కొద్ది మాసాలుగా కొవిడ్‌ నిబంధనలు పాటించకుండానే దర్శనాలు, పూజా కైంకర్యాలు కొనసాగిస్తున్నారు. ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు మాస్క్‌లు తప్పనిసరని, భౌతికదూరం పాటించాలని కనీస హెచ్చరికలు కూడా చేయడం లేదు. క్యూలైన్లు, ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేయడం లేదు. భక్తులకే పట్టని కరోనా నిబంధనలు తమకెందుకన్నట్టు ఆలయ అధికారులు, ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. ఆలయాలే కాదు ప్రస్తుతం శాసన మండలి ఎన్నికల ప్రచార సభలు, ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోల్లో సైతం కరోనా నిబంధనలను గాలికి వదిలేశారు.

Updated Date - 2021-03-02T06:43:44+05:30 IST