బ్రహ్మోత్సవ ఆరంభం తరలివచ్చిన భక్తజనం

ABN , First Publish Date - 2021-02-20T05:59:51+05:30 IST

రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ గణపతి పూజతో ప్రారంభం కాగా, నిర్విఘ్నంగా జరగాలని అర్చకులు దీక్షాధారణ సంకల్పం చేశారు.

బ్రహ్మోత్సవ ఆరంభం తరలివచ్చిన భక్తజనం
శివుడి సన్నిధిలో నిద్రిస్తున్న భక్తులు

నార్కట్‌పల్లి: రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ  జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ గణపతి పూజతో ప్రారంభం కాగా, నిర్విఘ్నంగా జరగాలని అర్చకులు దీక్షాధారణ సంకల్పం చేశారు. సాయంత్రం యాగశాల ప్రదక్షిణ, ఏకాదశ రుద్రాభిషేకం, పుణ్యహవాచనం, పంచగవ్యం, ప్రాశన, అఖండ దీపస్థాపన, త్రిశూల పూజ నిర్వహించారు. అనంతరం ఆదిదేవుడి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశారు. తొలి రోజు వేడుకలకు శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి తదితరులు అతిథులుగా హాజరుకాగా, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రాత్రి శివుడి సన్నిధిలోనే భక్తులు నిద్రచేశారు.


బ్రహ్మోత్సవాల్లో నేడు 

ఉదయం 10గంటలకు గవ్యాంతపూజలు, మార్జనలు, పుణ్యహావాచనం, పంచగవ్య మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, మహానివేదన, నీరాజన మంత్రపుష్పం.

సాయంతం 5గంటల నుంచి గవ్వాంత పూజలు, బలిహరణ, దీక్షాహోమం, నీరాజన మంత్ర పుష్పం.

రాత్రి 7గంటలకు పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవం.


Read more