
యాదాద్రి: యాదాద్రిలో సరైన సదుపాయాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండ కింద కల్యాణకట్ట దగ్గర భక్తుల నిరీక్షిస్తున్నారు. దర్శన టికెట్ల కోసం గంటల తరబడి భక్తులు ఎదురుచూస్తున్నారు. సెల్‌ఫోన్ డిపాజిట్ కౌంటర్లు లేకపోవడంతో భక్తుల అవస్థలు పడుతున్నారు. కొండపైకి వాహనాల అనుమతిపై అధికారుల పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారు. యథేచ్చగా తమ బంధువుల వాహనాలకే అధికారులు అనుమతిస్తున్నారు. తమ వాహనాలకు అనుమతించకపోవడంతో భక్తుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మంచినీటి కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ బాటిల్స్‌ను అధిక ధరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. యాదాద్రి ఆలయ భద్రత పట్ల అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి