డ్రైవింగ్‌లో ఏకాగ్రత అవసరం

ABN , First Publish Date - 2021-08-03T06:03:16+05:30 IST

డ్రైవింగ్‌లో ఏకాగ్రత ఎంతో అవసరమని దాంతో పాటు మంచి అలవాట్లు, చక్కని నిద్రతో ప్రమాద రహిత డ్రైవింగ్‌ చేయవచ్చని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

డ్రైవింగ్‌లో ఏకాగ్రత అవసరం
మాట్లాడుతున్న డీఎఫ్‌వో శ్రీనివాసరెడ్డి, వేదికపై ఆర్‌ఎం రాఘవకుమార్‌ తదితరులు

డీఎఫ్‌వో శ్రీనివాసరెడ్డి

గుంటూరు, ఆగస్టు 2: డ్రైవింగ్‌లో ఏకాగ్రత ఎంతో అవసరమని దాంతో పాటు మంచి అలవాట్లు, చక్కని నిద్రతో ప్రమాద రహిత డ్రైవింగ్‌ చేయవచ్చని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ ఆర్‌ఎం ఎస్‌టీపీ రాఘవకుమార్‌ అధ్యక్షతన ఎన్‌టీఆర్‌ బస్టాండ్‌లోని గుంటూరు-2 డిపోలో హెవీ డ్రైవింగ్‌ శిక్షణ తరగతులను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయన్నారు.  ఆర్‌ఎం రాఘవకుమార్‌ మాట్లాడుతూ డ్రైవర్లు డ్రైవింగ్‌ సమయంలో సమయస్ఫూర్తి, వేగ నియంత్రణతో వాహనశక్తిని గ్రహించినప్పుడే ఇంధనపొదుపు, ప్రమాదాల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎంఈ శరత్‌బాబు, డిప్యూటీ సీటీఎం నర్రా శ్రీనివాసరావు, డిపో మేనేజర్‌ మల్లికార్జునరెడ్డి, ఏటీఎం శ్రీనివాసరెడ్డి, సేఫ్టీ ఇన్‌స్ట్రక్టర్లు పాల్గొన్నారు.  


Updated Date - 2021-08-03T06:03:16+05:30 IST