దేశ పౌరులు, విదేశీయులకు కువైత్ కీలక సూచన!

ABN , First Publish Date - 2021-07-28T13:39:33+05:30 IST

ఆగస్టు 1 నుంచి కువైత్ అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను తొలగిస్తున్న విషయం తెలిసిందే.

దేశ పౌరులు, విదేశీయులకు కువైత్ కీలక సూచన!

కువైత్ సిటీ: ఆగస్టు 1 నుంచి కువైత్ అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తాజాగా ఎయిర్‌లైన్లకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే దేశ పౌరులతో పాటు విదేశీ ప్రయాణికులకు కీలక సూచనలు చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోని దేశ పౌరులను విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని డీజీసీఏ తన సర్క్యూలర్‌లో పేర్కొంది. అలాగే విదేశాల నుంచి కువైత్ వచ్చే ప్రయాణికులందరూ తప్పనిసరిగా వారం రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. క్వారంటైన్ చివరి రోజు పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి. రిపోర్టు నెగెటివ్ వస్తే క్వారంటైన్ విరమించుకోవచ్చు.


అంతేగాక కువైత్ వచ్చే ప్రయాణికులకు జర్నీకి 72 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి. నాన్-కువైటీస్ ఎవరైతే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారో వారు సంబంధిత సర్టిఫికేట్‌ను కువైత్ ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. అది కూడా క్యూఆర్ కోడ్‌తో ఉండాలి. ట్రావెల్‌కు ముందు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఆమోదం పొందడం తప్పనిసరి. అలాగే జర్నీకి ముందే ప్రయాణికులందరూ Shlonik, Kuwait Mosafar appలో రిజిస్టర్ చేసుకోవడం కూడా తప్పనిసరి అని డీజీసీఏ పేర్కొంది. అయితే, ఈ సర్క్యూలర్‌లో భారత్ నుంచి నేరుగా విమాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభం అయ్యేది మాత్రం వెల్లడించలేదు.  

Updated Date - 2021-07-28T13:39:33+05:30 IST