DGCA: విమానాలకు పక్షుల ముప్పుపై కొత్త మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2022-08-14T01:30:55+05:30 IST

విమానాలను పక్షులు, ఇతర వన్యప్రాణులు ఢీకొడుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతుండటంతో...

DGCA: విమానాలకు పక్షుల ముప్పుపై కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: విమానాలను పక్షులు (birds), ఇతర వన్యప్రాణులు (other animals) ఢీకొడుతున్న (Hit) సంఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతుండటంతో ఏవియషన్ రెగ్యులేటర్ డీజీసీఏ (DGCA) శనివారంనాడు విమానాశ్రయాల నిర్వాహకులకు కొత్త మార్గదర్శకాలు  (Guidelines) జారీ చేసింది.  రాండన్ ప్యాట్రన్‌లో రొటీన్ పెట్రోల్స్ జరపడం, వన్యప్రాణుల కదలికల సమాచారం పైలట్లకు తెలియజేయడం వంటివి చేయాలని సూచించింది.


ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు అందరూ వన్యప్రాణుల విపత్తు నిర్వహణ కార్యక్రమాలను సమీక్షించాలని, లోపాలను సరిచేసి విమానాశ్రయం, పరిసర ప్రాంతాల్లో పకడ్బందీగా అమలు చేయాలని చెప్పింది. వన్యప్రాణాల ముప్పుపై అంచనాలు, కదలికలను పర్యవేక్షించడం, రికార్డు చేసేందుకు తప్పనిసరిగా ఒక విధానం కలిగి ఉండాలని పేర్కొంది. రోజూ  ఒకే సమయానికి కాకుండా వేర్వేరు సమయాల్లో సాధారణ పెట్రోలింగ్ నిర్వహించాలని, ప్రతి నెలా వన్యప్రాణాల విపత్తు నిర్వహణ కార్యక్రమం అమలుపై 7వ తేదీలోగా నివేదకలు ఇవ్వాలని, వన్యప్రాణాల డాటా అందజేయాలని డీజీసీఏ ఆదేశించింది.


Updated Date - 2022-08-14T01:30:55+05:30 IST