టీకా తీసుకుంటే 2 రోజులు విమానాలకు బ్రేక్

ABN , First Publish Date - 2021-03-10T01:51:20+05:30 IST

టీకా తీసుకున్నాక 48 గంటల పాలు పైలట్లు, క్యాబిన్ క్రూ విమాన ప్రయాణాలు చేయకూడదని పౌర విమానయాన శాఖ(డీజీసీఏ) తాజాగా ఆదేశించింది.

టీకా తీసుకుంటే 2 రోజులు విమానాలకు బ్రేక్

న్యూఢిల్లీ: టీకా తీసుకున్నాక 48 గంటల పాలు పైలట్లు, క్యాబిన్ క్రూ విమాన ప్రయాణాలు చేయకూడదని పౌర విమానయాన శాఖ(డీజీసీఏ) తాజాగా ఆదేశించింది. టీకా తీసుకున్నాక వారు 48 గంటల పాటు ఆరోగ్యపరంగా  విధులు నిర్వహించే స్థితిలో ఉండరని పేర్కొంది. ఈ మేరకు డీజీసీఏ మంగళవారం నాడు కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ గడువు తరువాత కూడా సిబ్బందికి వైద్య పరీక్షలు ఉంటాయని, ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేని సిబ్బందికి మాత్రమే విధుల్లో చేరేందుకు అనుమతి ఉంటుందని పేర్కొంది. 48 గంటల తరువాత పైలట్‌లో ఆరోగ్య సమస్య తలెత్తితే.. అటువంటి వారు వైద్యుడిని రిఫర్ చేయాల్సి ఉంటుందని సూచించింది. అంతేకాకుండా.. కొరోనా సోకిన అనంతరం సిబ్బందిలో 14 రోజులకు మించి అస్వస్థత కొనసాగితే..వారి ఆరోగ్య పరిస్థితులను ప్రత్యేక వైద్యపరీక్షల ద్వారా అంచనా వేస్తామని కూడా పేర్కొంది.  

Updated Date - 2021-03-10T01:51:20+05:30 IST