
న్యూఢిల్లీ : విమానాల జాప్యానికి సంబంధించి వివరణనివ్వాల్సిందిగా... Indigo Airlinesను DGCA(Director General of Civil Aviation) కోరింది. దేశవ్యాప్తంగా విమానాలు జాప్యంతో నడుస్తోన్న విషయాన్ని DGCA తీవ్రంగా పరిగణించింది. కాగా... సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా పలు ఇండిగో విమానాలు షెడ్యూల్లో ఆలస్యంగా నడుస్తున్నట్లు వినవస్తోంది.
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా నిన్న(శనివారం) పలు ఇండిగో విమానాలు ఆలస్యంగా నడిచాయి. విమానయాన మంత్రిత్వ శాఖ డేటాను ఉటంకిస్తూ... ఇండిగో యొక్క దేశీయ విమానాలలో 55 శాతం షెడ్యూల్లో వెనుకబడి ఉన్నాయని ఓ నివేదిక పేర్కొంది. గణనీయమైన సంఖ్యలో క్యాబిన్ సిబ్బంది అనారోగ్యంతో సెలవు తీసుకోవడమే ఇందుకు కారణమని ఇండిగో పేర్కొంది. భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో ప్రస్తుతం రోజుకు 1,600 విమానాలను దేశీయంగా, అంతర్జాతీయంగా నిర్వహిస్తోంది.
ఇవి కూడా చదవండి