DGP Praveen Sood: మళ్లీ ఎస్‌ఐ పరీక్షలు

ABN , First Publish Date - 2022-09-20T17:08:44+05:30 IST

రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఎస్‌ఐ నియామకాల అక్రమ దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందని డీజీపీ ప్రవీణ్‌సూద్‌(DGP

DGP Praveen Sood: మళ్లీ ఎస్‌ఐ పరీక్షలు

- అక్రమాలపై చార్జ్‌షీట్‌ అనంతరం నిర్వహణ

- డీజీపీ ప్రవీణ్‌సూద్‌ 


బెంగళూరు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఎస్‌ఐ నియామకాల అక్రమ దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందని డీజీపీ ప్రవీణ్‌సూద్‌(DGP Praveen Sood) వెల్లడించారు. బెంగళూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 545 మంది ఎస్‌ఐ నియామకాలకు సంబంధించిన వ్యవహారంపై చార్జ్‌షీట్‌ దాఖలైన తక్షణం మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని, అర్హులైన ఎవరికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. ఇప్పటికే మొత్తం నియామక ప్రక్రియను ప్రభుత్వం రద్దు చేసిన సంగతిని గుర్తు చేశారు. అయితే కొందరు అభ్యర్థులు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారని పేర్కొన్నారు. హైకోర్టు(High Court) ముందుకు అక్రమాలకు సంబంధించిన అన్ని విషయాలను కూలంకుషంగా తెలియచేస్తామన్నారు. ఇప్పటికే సీఐడీ విభాగం ఈ అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరుపుతోందని, అక్టోబరు నాటికి చార్జ్‌షీట్‌ను దాఖలు చేస్తామన్నారు. సీఐడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు తిరిగి పరీక్షలు నిర్వహించే అంశంపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించబోమన్నారు. 

Updated Date - 2022-09-20T17:08:44+05:30 IST