సమాజానికి మార్గదర్శకులు కావాలి

ABN , First Publish Date - 2022-05-31T16:12:19+05:30 IST

విద్యార్థులు సమాజానికి మార్గదర్శకులు కావాలని డీజీపీ శైలేంద్రబాబు పిలుపునిచ్చారు. వేలూరు వీఐటీ యూనివర్శిటీ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం స్టార్స్‌ దిన

సమాజానికి మార్గదర్శకులు కావాలి

                       - విద్యార్థులకు డీజీపీ సూచన 


వేలూరు(చెన్నై): విద్యార్థులు సమాజానికి మార్గదర్శకులు కావాలని డీజీపీ శైలేంద్రబాబు పిలుపునిచ్చారు. వేలూరు వీఐటీ యూనివర్శిటీ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం స్టార్స్‌ దిన వేడుకలు జరిగాయి. వర్సిటీ ఛాన్సలర్‌ విశ్వనాధన్‌ అధ్యక్షత వహించిన వేడులకు ముఖ్యఅతిథిగా హాజరైన డీజీపీ శైలేంద్రబాబు మాట్లాడుతూ, విద్య పోరాడేందుకు ఆయుధం వంటిదని, జీవితం ఒక యుద్ధరంగమని గుర్తించి, వీరులుగా పోరాడేలా విద్యార్థులు సమాయత్తం కావాలన్నారు. లక్ష్యసాధన ఉన్నత స్థాయికి వెళ్లేందుకు దోహదపడుతుందని, విద్యార్థులు తమ లక్ష్యం నిర్ణయించుకుని పయనించాలని డీజీపీ సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ ఉపాధ్యక్షుడు శంకర్‌, పథక ఆర్గనైజర్‌ మీనాక్షి, వైస్‌, ప్రొ ఛాన్సలర్‌ నారాయణన్‌, రిజిస్ట్రార్‌ సత్యనారాయణన్‌, విద్యార్థుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ నైజా తదితరులు పాల్గొన్నారు. స్టార్స్‌ పథకంలో చదివిన పూర్వ విద్యార్థులు తమ ఒకరోజు వేతనం రూ.3 లక్షల చెక్‌ను ఈ పథకానికి విరాళంగా అందజేశారు.

Updated Date - 2022-05-31T16:12:19+05:30 IST