DGP: ‘మత్తు’కు సహకరించారో అంతే...

ABN , First Publish Date - 2022-09-17T16:17:12+05:30 IST

రాష్ట్రంలో గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాల క్రయవిక్రయాలకు ఎవరైనా సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శైలేంద్రబాబు

DGP: ‘మత్తు’కు సహకరించారో అంతే...

- ఇప్పటికే 2 వేల మంది ఆస్తుల సీజ్‌

- డీజీపీ శైలేంద్రబాబు 


అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 16: రాష్ట్రంలో గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాల క్రయవిక్రయాలకు ఎవరైనా సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శైలేంద్రబాబు(DGP Shailendra Babu) హెచ్చరించారు. తంజావూరులో కొత్తగా ఏర్పాటు చేసిన పోలీస్‌ కంట్రోల్‌ రూంను గురువారం సాయంత్రం ప్రారంభించిన డీజీపీ విలేఖరులతో మాట్లాడుతూ.. మత్తు పదార్థాలను విక్రయిస్తున్న 2 వేల మంది బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేశామని, అలాంటి వారిపట్ల ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మత్తుపదార్థాల రవాణా పట్ల పోలీస్‏శాఖ సీరియ్‌సగా వుందని, ఈ విషయంలో ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. గత యేడాది విగ్రహాల అక్రమ రవాణా నిరోధక విభాగం 187 రకాల అరుదైన విగ్రహాలను స్వాధీనం చేసుకుందన్నారు. భవిష్యత్‌లో ఏ  విగ్రహం చోరీకి గురికాకుండా ఉండేలా మద్రాస్‌ ఐఐటీ(Madras IIT) పరిశోధనా విభాగం సహకారంతో డిజిటల్‌ ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ విధానంలో రిజిస్టర్‌ చేస్తున్నట్టు చెప్పారు. అలాంటి విగ్రహాలు చోరీకి గురైతే అవి ఎక్కడ వున్నా ఇట్టే తెలుసుకోవచ్చని డీజీపీ వివరించారు. 

Updated Date - 2022-09-17T16:17:12+05:30 IST