సైబర్‌ నేరాల విచారణకు ప్రత్యేక విభాగం

ABN , First Publish Date - 2022-06-03T13:47:43+05:30 IST

సైబర్‌ నేరాల కేసులను విచారించేందుకు పోలీస్‌ స్టేషన్లలో ప్రత్యేక విభాగాలు (స్పెషల్‌ వింగ్‌) ప్రారంభించాలని డీజీపీ శైలేంద్రబాబు ఆదేశించారు. ఇటీవల

సైబర్‌ నేరాల విచారణకు ప్రత్యేక విభాగం

                  - పోలీస్‌ స్టేషన్లలో ఏర్పాటు: డీజీపీ శైలేంద్రబాబు


అడయార్‌(చెన్నై), జూన్‌ 2: సైబర్‌ నేరాల కేసులను విచారించేందుకు పోలీస్‌ స్టేషన్లలో ప్రత్యేక విభాగాలు (స్పెషల్‌ వింగ్‌) ప్రారంభించాలని డీజీపీ శైలేంద్రబాబు ఆదేశించారు. ఇటీవల కాలంలో సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక మోసాలపై కేసులు ఎక్కువగా నమోదవుతు న్నాయి. 2011లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 748 సైబర్‌ నేరాలు మాత్రమే నమోదు కాగా, 2021 సంవత్సరంలో ఈ కేసుల సంఖ్య 13,077కు పెరిగింది. దీంతో రాష్ట్ర పోలీస్‌ శాఖ సైబర్‌ నేరాల విచారణ కోసం ప్రత్యేక విభాగాన్ని, ఆరు జిల్లాల్లో సైబర్‌ నేరాల పరిశోధనా కేంద్రాలను 2019 నుంచి ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇపుడు సైబర్‌ నేరాల విచారణకు ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలోనే స్పెషల్‌ వింగ్‌ ఏర్పాటుచేయాల్సిందిగా డీజీపీ ఆదేశించారు. ఆయా పోలీస్‌ స్టేషన్లలో అసిస్టెంట్‌ కమిషనర్‌ నేతృత్వంలో ఫస్ట్‌గ్రేడ్‌ కానిస్టేబుల్‌, ఒక రిసెప్షనిస్టును ప్రత్యేకంగా నియమించాలని డీజీపీ సూచించారు. సైబర్‌ నేరాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు తక్షణం సీఎస్సార్‌ కాపీని బాధితులకు అందజేయాలని డీజీపీ ఆదేశించారు. ఇదిలా వుండగా రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకే ఈ స్పెషల్‌ వింగ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-06-03T13:47:43+05:30 IST