UAE: ప్రవాసులు బీకేర్‌ఫుల్.. యూఏఈలో ఈ తప్పు చేస్తే రూ. 4.45 లక్షల జరిమానా.. రెండేళ్ల జైలు!

ABN , First Publish Date - 2022-09-28T16:28:13+05:30 IST

అరబ్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. చిన్నచిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు ఉంటాయి.

UAE: ప్రవాసులు బీకేర్‌ఫుల్.. యూఏఈలో ఈ తప్పు చేస్తే రూ. 4.45 లక్షల జరిమానా.. రెండేళ్ల జైలు!

అబుదాబి: అరబ్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. చిన్నచిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు ఉంటాయి. ఇక చట్టాల అమలు విషయంలో అక్కడి దేశాలు ఎలాంటి బేధాన్ని చూపించవు. ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలితే దేశానికి రాజు అయినా సరే సామాన్యులకు ఏ శిక్ష అయితే ఉంటుందో అదే శిక్షను అతనికి అమలు చేయడం జరుగుతుంది. ఇలా చట్టాల అమలు విషయంలో అరబ్ దేశాలు చాల కఠినంగా ఉంటాయి. ఇక దేశంలో నేరాలను కంట్రోల్ చేసేందుకు కూడా భారీ జరిమానాలు, కఠిన శిక్షలు విధిస్తుంటాయి. అందుకే ఆ దేశాల్లో క్రైమ్ రేటు చాలా తక్కువ అనే చెప్పాలి. 


ఈ నేపథ్యంలోనే తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(United Arab Emirates).. నివాసితులు, ప్రవాసులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. విలువైన వస్తువులు లేదా భారీ మొత్తంలో నగదు దొరికినప్పుడు వాటిని 48 గంటలలోపు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలి. అలా కాకుండా తమతో పాటు ఉంచుకుంటే అది నేరంగా పరిగణించడం జరుగుతుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. దీనికిగాను 20వేల దిర్హమ్స్(రూ.4.45లక్షలు) జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిపింది. 2021లో తీసుకొచ్చిన ఫెడరల్ డీక్రీ నం.31లోని అర్టికల్ 454 ప్రకారం ఇలా వేరే వాళ్లకు చెందిన నగదు లేదా ఖరీదైన వస్తువులను దాచుకునే వ్యక్తికి ఈ శిక్షను విధించడం జరుగుతుందని పేర్కొంది. అందుకే యూఏఈలోని ప్రవాసులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేనిపక్షంలో భారీ జరిమానాతో పాటు రెండేళ్లు జైలుకెళ్లాల్సి ఉంటుంది. 

Updated Date - 2022-09-28T16:28:13+05:30 IST