మేత కోసం మూగజీవాల వలస

ABN , First Publish Date - 2021-04-24T03:47:46+05:30 IST

ఉపాధి కోసం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసలు పోవటం పరిపాటి. అయితే మేత కోసం మూగజీవాలు కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసలు పోకతప్పడం లేదు.

మేత కోసం మూగజీవాల వలస
మేత కోసం తరలిపోతున్న గొర్రెలు

కావలి, ఏప్రిల్‌ 23: ఉపాధి కోసం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసలు పోవటం పరిపాటి. అయితే మేత కోసం మూగజీవాలు కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసలు పోకతప్పడం లేదు. కొండాపురం మండలం కొమ్మి గ్రామం నుంచి సుమారు ఐదారు వందల మూగజీవాలు(గొర్రెలు) అల్లూరుకు మేత కోసం కావలి మీదుగా వలసపోతూ కావలి ఆర్వోబీ వంతెనపై ఆంధ్రజ్యోతి కెమెరాకు కంటపడ్డాయి. మెట్టప్రాంతమైన కొండాపురం మండలంలో రైతులు వ్యవసాయం కన్నా పాడి పశువులు, మూగజీవాలు పెంచుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎండలు మండిపోతుండటంతో మెట్ట ప్రాంతాలలో మూగ జీవాలకు మేత దొరకకపోవటంతో వాటిని మేత లభ్యమయ్యే డెల్టా ప్రాంతమైన అల్లూరుకు తోలుకెళుతున్నారు. అక్కడ మేత దొరికినన్ని రోజులు అక్కడే ఉంచి ఆ తర్వాత వారి స్వగ్రామాలకు తోలుకెళ్తారు.

Updated Date - 2021-04-24T03:47:46+05:30 IST