NDA Vice President అభ్యర్థిపై రాజ్‌నాథ్ ట్వీట్

ABN , First Publish Date - 2022-07-17T08:58:31+05:30 IST

NDA Vice President అభ్యర్థిపై రాజ్‌నాథ్ ట్వీట్

NDA Vice President అభ్యర్థిపై రాజ్‌నాథ్ ట్వీట్

న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్‌డీఏ అభ్యర్థిగా జగ్‌దీప్ ధన్‌ఖర్ నామినేషన్ వేయడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఎన్‌డీఏ అభ్యర్థి జగ్‌దీప్ ధన్‌ఖర్‌ను మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. జగ్‌దీప్ ధన్‌ఖర్ ప్రజా సేవలో సంవత్సరాలు గడిపాడని మంత్రి ట్వీట్ చేశారు. ఆయనకు చట్టం, రాజ్యాంగంపై లోతైన అవగాహన ఉన్న రైతు బిడ్డ అని చెప్పారు. ఆయన అనుభవంతో భారతదేశం ఎంతో ప్రయోజనం పొందుతుందని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-07-17T08:58:31+05:30 IST